అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన బాలయ్య… నాలుగో హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. “ది వరల్డ్ నోస్ హిమ్ బట్ నో వన్ నోస్ హిస్ వరల్డ్” అనే కొటేషన్ తో రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లిపోయింది ఈ సినిమా. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.
తండ్రి కొడుకులుగా బాలయ్య నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది కానీ ఈ విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. లేటెస్ట్ గా NBK 109 గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు అనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇటీవలే బాలయ్య-దుల్కర్ సల్మాన్ ఖాన్ మధ్య సీన్స్ ని కూడా షూట్ చేసారని టాక్. ఈ ఇద్దరి మధ్య సీన్స్ సూపర్ గా వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దుల్కర్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి అదే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న NBK 109లో క్యామియో ప్లే చేయడానికి దుల్కర్ ఓకే చెప్పి ఉంటాడని సమాచారం. మరి మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి.