NTV Telugu Site icon

NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?

Nbk 108

Nbk 108

నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు కాబట్టి బాలయ్య డైలాగ్స్ ఏ రేంజులో పేలతాయో చూడాలి. ఈ దసరాకి ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయిన NBK 108 సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ స్కేల్ లో మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జూన్ 10న బాలయ్య బర్త్ డే కావడంతో NBK  108 నుంచి ఫాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, బాలయ్య పుట్టిన రోజు కన్నా రెండు రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేయనున్నారు.

బాలయ్య నటిస్తున్న 108వ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 108 చోట్ల సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ హోర్డింగ్స్ పెట్టడానికి సిద్ధమయ్యారు. దాదాపు అన్ని సిటీస్ అండ్ టౌన్స్ లో NBK 108 రివీల్ హోర్డింగ్స్ కనిపించనున్నాయి. ప్రొడ్యూసర్స్ టైటిల్ అనౌన్స్మెంట్ కే ఈ రేంజ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంటే అభిమానుల్లో NBK 108 సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, NBK 108 సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ని ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టాగ్ లైన్ ని ఫైనల్ చేసారని సమాచారం. మరి ఈ టైటిల్ నే అనిల్ రావిపూడి కూడా ఫిక్స్ చేశాడా లేక మరో కొత్త టైటిల్ తో నందమూరి అభిమానులకి స్వీట్ షాక్ ఇస్తాడా అనేది చూడాలి.