Site icon NTV Telugu

Major: ప్యాన్ ఇండియా సినిమా ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్

Major Trailer

Major Trailer

తెలుగు చిత్రసీమలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ‘మేజర్’ ఒకటి. 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో అడివి శేష్ నటిస్తుండగా.. సాయి కిరణ్ తిక్క రచనా దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న తరుణంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

రేపు (మే 9వ తేదీన సాయంత్రం 04:59 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సోనీ పిక్చర్స్‌, ఏ+ఎస్ మూవీస్‌తో కలిసి జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్‌పై మహేశ్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు కాబట్టి, ఈ ట్రైలర్‌ని సూపర్‌స్టారే విడుదల చేసే ఆస్కారం ఉంది. ఇంతకుముందు రిలీజైన టీజర్‌తో అంచనాలు బాగానే పెరిగిపోవడంతో, ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ళ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా బహుభాషల్లో దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.

Exit mobile version