Major Trailer: నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. మేజర్ సందీప్ గా అడివి శేష్ నటించాడు అనడం కన్నాజీవించాడు అని చెప్పాలి. దేశం కోసం తల్లిదండ్రులను, భార్యను వదిలి.. తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సోల్జర్ కథ ఇది.
ఉన్నికృష్ణన్ చిన్నతనం నుంచి అతను దేశం కోసం ప్రాణాలు వదిలేవరకు అన్ని ముఖ్యమైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. “నా కొడుకు.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. వెనకడుగేసే అవకాశమే లేదు.. తప్పించుకొనే దారి ఉంది. ముందుకు వెళ్తే చనిపోతాడని తెలుసు.. అయినా వెళ్ళాడు.. చావు కళ్లలోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు”అంటూ ప్రకాష్ రాజ్ భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్క భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఇక ఆ దాడుల్లో చిక్కుకున్న ఒక యువతి లా శోభితా దూళిపాళ్ల కనిపించింది. మొత్తానికి ట్రైలర్ గూస్ బంప్స్ తో పాటు భావోద్వాగానికి గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళ భాషల్లో 2022 జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో శేష్ ఎన్ని రికార్డులు సాదిస్తాడో వేచి చూడాల్సిందే.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!