వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘హృదయం…’ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రేమ కథని అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ‘ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ ను ఈ నెల 18న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శేష్, సాయి మంజ్రేకర్ జోడి బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా కనిపించారు. 1995లో యంగ్ సందీప్ లవ్ లైఫ్ ని ఈ పోస్టర్ లో ఆవిష్కరించారు. అలాగే పోస్టర్ డిజైన్ కూడా 1995 పాత ఆడియో క్యాసెట్ అంచులని గుర్తు చేస్తూ వింటేజ్ లుక్ లో డిజైన్ చేశారు. ఈ పాట మరో రొమాంటిక్ మెలోడీగా ఉండబోతోంది.
వివిధ భాషలకు చెందిన ముగ్గురు సూపర్‌స్టార్లు విడుదల చేసిన మేజర్ థియేట్రికల్ ట్రైలర్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటివరకూ ట్రైలర్ 35 మిలియన్ల వ్యూస్, 900కే పైగా లైక్‌లను పొందింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు.
Whatsapp Image 2022 05 16 At 6.22.25 Pm
