Major Movie: మహారాష్ట్ర సీఎంను కలిసిన ‘మేజర్’ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. 2011లో ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన పోరాట యోధుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ మూవీని శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో మేజర్ మూవీ టీమ్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను మర్యాదపూర్వకంగా కలిసింది. మహారాష్ట్ర సీఎంను కలిసిన వారిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా నటించిన హీరో అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్కా, నటి సాయి మంజ్రేకర్ ఉన్నారు.
కాగా మేజర్ సినిమా సక్సెస్ అయినందుకు చిత్రబృందాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అభినందించారు. మేజర్ సినిమా అద్భుతంగా ఉందని.. 26/11 ముంబై దాడులలో దేశం కోసం పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, ఆయన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించినందుకు బృందాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేజర్ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. కాగా మేజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిసిన విషయాన్ని హీరో అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని కలిసే అద్భుతమైన అవకాశం వచ్చింది.. వారు ఎన్డీఏలో చేరానుకున్నవారికి సాయం చేయాలనే మా నిర్ణయానికి అన్ని రకాలుగా మద్దతునిస్తానని హామీ ఇచ్చారు. ఇది ఒక అపురూపమైన క్షణం. మా సినిమా గురించి అద్భుతమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్’ అంటూ అడివి శేష్ ట్వీట్ చేశాడు.
Had the incredible opportunity to meet the Honourable CM of Maharashtra Shri UddhavThackeray. He promised to extend full support for our MAJOR promise fund for NDA aspirants. It was an incredible moment. Thank you for the amazing words about our film sir. @CMOMaharashtra (1/2) pic.twitter.com/xOKN5liRk7
— Adivi Sesh (@AdiviSesh) June 13, 2022
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!