దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగులో యువ కథానాయకులకే కాదు అగ్ర కథానాయకులకు చక్కని మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు చక్రి. అతని సోదరుడు మహిత్ నారాయణ సైతం అన్నయ్య బాటలో నడుస్తూ, ఇప్పుడు పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ‘సి-స్టూడియోస్ (ది సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ పేరుతో ఓ స్టూడియోను నెలకొల్పబోతున్నారు. దీని లోగోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చక్రిగారి వద్దకు మేము వర్క్ చేయడానికి డబ్బు కోసం కాదు, ఆయన ప్రేమ కోసం వచ్చేవాళ్లం.
Read: Elon Musk: చిన్నారుల ఆకలి తీర్చేందుకు రూ. 43 వేల కోట్ల విరాళం…
చక్రిగారి తమ్ముడు మహిత్ నారాయణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలని కోరుకుంటున్నాను. చక్రి పేరు మీద వస్తున్న సి–స్టూడియో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. ఓ బ్రదర్‌గా మహిత్ నారాయణ్‌కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ‘లోగో ట్యాగ్ లైన్ ‘సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ అనేది తనను ఎంతో ఆకట్టుకున్నదని, చక్రి కూడా అందరితో సోల్‌ఫుల్‌గా, ఆత్మీయంగా ఉండేవారని తమన్ చెప్పారు. మహిత్ నారాయణ్ మాట్లాడుతూ, ‘అన్నయ్య చక్రి ఆశీస్సులతో పాటు, అందరి ఆశీస్సులు తనకు కావాలని, స్టూడియో లోగోలో రెండు ‘సి’లు ఉన్నాయని, ఇందులో ఒకటి అన్నయ్య చక్రి పేరు, రెండోది మెగాస్టార్ చిరంజీవి పేరు అని, వారిద్దరూ తనకు ఆదర్శమని అన్నారు.
