Mahesh Vitta : కమెడియన్ మహేశ్ విట్టా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. ఫన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించాడు. దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించాడు. నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానన్ని చెప్పా. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసి మానేశా. ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలనే తపనతో వచ్చాను. రాగానే నాకు ఫన్ బకెట్ లో ఛాన్స్ వచ్చింది. కానీ అనుకోకుండా నేనే నటించాను. అప్పుడు కూడా నాకు పెద్దగా సాలరీ లేదు.
Read Also : Chiranjeevi : చిరు-అనిల్ సినిమాలో కాంట్రవర్సీ నటుడే విలన్..?
రూమ్ రెంట్ కే డబ్బులు అన్నీ అయిపోయేవి. తినడానికి డబ్బులు కూడా ఉండేవి కావు. అందుకే ఆఫీస్ కు వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్ధం చెప్పేవాడిని. హర్ష నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు రూ.50 ఇచ్చి వెళ్లి తిని రమ్మనేవాడు. అలా నన్ను ఐదేళ్ల పాటు చంటిపిల్లాడిలా చూసుకున్నాడు. ఆయన అంటే ఎంతో ఇష్టం నాకు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. పేరు అయితే సంపాదించా గానీ.. డబ్బులు మాత్రం సంపాదించలేకపోయాను. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉంటున్నా అని మాత్రం చెప్పగలను అని ఎమోషనల్ అయ్యాడు మహేశ్.
Read Also : Komali Prasad : దాని కోసం లిప్ లాక్ ఇస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
