Site icon NTV Telugu

AP Govt new G.O: కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్

mahesh babu

mahesh babu

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌లో స్పందించారు.

Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !

“కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని మహేష్ ట్వీట్ చేశాడు. మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కూడిన టాలీవుడ్ బృందం తెలుగు చిత్రసీమ సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version