గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట ఎక్కడ కనిపించడం లేదు. ఫారిన్ టూర్లకు కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న SSMB 29 లుక్ రివీల్ అవుతుందోనని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మహేశ్. కానీ ఎట్టకేలకు ఒక లీకేజీ బయటికొచ్చేసింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి మహేశ్ బాబును సింహం అన్నట్టుగా చూపిస్తు వస్తున్నాడు రాజమౌళి. లొకేషన్ రెక్కీకి వెళ్లినప్పుడు, పాస్‌పోర్ట్ లాక్కున్నానని చెప్పినప్పుడు.. మహేష్ పేరును సింహంతో ట్యాగ్ చేసి చూపించాడు.
Also Read : Priya Vadlamani : సమ్మేళనం బ్యూటీ స్పెషల్ ఫొటోస్.. అదుర్స్..
కాబట్టి రాజమౌళి ఈసారి ఊహకందని విధంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. షూటింగ్ మొదలైందని చెబుతున్నప్పటికీ అధికారిక ప్రకటన లేదు. అలాగే మహేశ్ బాబు లుక్ ఎక్కడా రివీల్ కాలేదు. కానీ లేటెస్ట్‌గా మహేష్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. జస్ట్ 14 సెకన్లు ఉన్న ఈ వీడియోలో మహేశ్ బాబును చూస్తే జూలు విదిల్చిన సింహంలా వేటకు సిద్ధమైనట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఊరమాస్ లుక్‌లో ఉన్నాడు సూపర్ స్టార్. భారీ గడ్డం, లాంగ్ హెయిర్‌తో అరాచకం అనేలా ఉన్నాడు. ఇది చూసిన ఘట్టమనేని అభిమానులు రాజమౌళి, మహేశ్ కాంబో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు చూడని లుక్‌లో మెంటల్ మాస్ అనేలా కనిపిస్తున్నాడు మహేశ్ బాబు. జస్ట్ లీక్డ్ లుక్‌కే ఇలా ఉంటే.. ఇక ఫస్ట్ లుక్ బయటికొస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.