Site icon NTV Telugu

Mahesh Babu: ‘శ్రీమంతుడు’ ఒక్కటే కాదు.. ‘మహర్షి’ కూడా నా నవలకి కాపీనే… రచయిత సంచలనం

Sarath Chandra Interview

Sarath Chandra Interview

Mahesh Babu’s Maharshi Film is also copy to my novel says Sarath Chandra: RD విల్సన్, అలియాస్ శరత్ చంద్ర ఇప్పుడు తెలుగులో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు (2015) సినిమా చేశాడని ఆరోపించడమే కాదు రచయితల సంఘం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకున్నాడు. 2012లో స్వాతి మ్యాగజైన్‌లో ప్రచురితమైన తన రచన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలకి మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా పూర్తి కాపీ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలుగు సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు, ఇక ఈ క్రమంలో రెండు కథలను విశ్లేషించిన తర్వాత, శ్రీమంతుడు కోర్ ప్లాట్ ఈ నవల నుంచి కాపీ చేయబడిందని నిర్ధారించారు. అనేక వాయిదాల అనంతరం ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది.

Sundaram Master Trailer: పరీక్ష ఫెయిల్ అయితే ఉరి వేయడం ఏంట్రా.. ఏ ఊర్రా అది

అక్కడ న్యాయమూర్తులు కూడా కాపీరైట్ ఉల్లంఘన నిజమే అని తేల్చింది. ఇక కొరటాల శివపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని కూడా పేర్కొంది. ఇక ఇప్పుడు, అదే రచయిత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా తన మరో రచన ‘సమహారం’కి సీన్-టు-సీన్ కాపీ అని ఆరోపించారు. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా మహర్షి (2019)లో రిలీజ్ అయింది. శ్రీమంతుడు సమస్య పరిష్కారం కాగానే ఆ సినిమా రచయితలు వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలమన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శరత్ చంద్ర పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే ‘సూపర్ స్టార్’ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఆయన గత సినిమాల మీద కాపీ మరకలు పడుతూ ఉండడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version