NTV Telugu Site icon

Mahesh Babu: నేను వెకేషన్ కు వెళ్తే వారికి నచ్చాల్సిందేముంది.. మహేష్ స్ట్రాంగ్ కౌంటర్

Gunturu

Gunturu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన జీవితం గురించి చెప్పాలంటే.. సినిమా, కుటుంబం అంతే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటాడు.. లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంటాడు. ఇక ఈ వెకేషన్ వలనే గత కొన్నిరోజులుగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మహేష్ పెళ్లి తరువాత నమ్రతతో వెకేషన్ కు వెళ్ళేవాడు.. ఇక పిల్లలు పుట్టినదగ్గరనుంచి వారితో ఎక్కువ సమయం గడపడానికే చూస్తాడు. షెడ్యూల్ అవ్వడం ఆలస్యం.. విదేశాల్లో కుటుంబంతో వాలిపోతాడు. ఇక ఇంట్లో ఫంక్షన్స్, పార్టీలు, అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వక తప్పదు. ఇక ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమా ఆలస్యమవ్వడానికి మహేష్ వెకేషన్స్ కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను మధ్యలోనే వదిలేసి ఇలా వెకేషన్స్ కు తిరగడం బాగోలేదని, మహేష్ కు కథ నచ్చకపోవడం వలన రీ షెడ్యూల్స్ చేయాల్సి రావడంతో మరింత ఆలస్యమవుతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే విషయమై మహేష్ స్పందించాడు.

Guntur Kaaram: నో డౌట్స్.. బాబు ల్యాండ్ అయ్యేది సంక్రాంతికే

నేడు బిగ్ సి 12 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహేష్ ముందు రిపోర్టర్స్ తమ అనుమానాలను ప్రశ్నలుగా సంధించారు. ఎయిర్ పోర్ట్ లో మీ ఫొటోస్ ను అక్కడ ఫొటోగ్రాఫర్లు ట్రిప్ 1 , ట్రిప్ 2 , ట్రిప్ 3 అంటూ ఫోటోలు తీసి పెడుతున్నారు. అలా వెకేషన్స్ కు వెళ్లడం ఏంటి అని జనాలు అనుకోవడం మీ వరకు వచ్చిందా.. ? అన్న ప్రశ్నకు మహేష్ మాట్లాడుతూ.. ” నేను వెకేషన్ కు వెళ్తున్నాను అని నేనేగా చెప్తున్నాను. నేనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. నా ఫొటోస్, వెకేషన్స్ చూసి మీరేమైనా ఈర్ష్య పడుతున్నారా.. ?మీకు నచ్చడం లేదా.. ?” అని నవ్వుతు సమాధానమిచ్చాడు. దానికి మాకు నచ్చుతుంది కానీ, కొంతమందికి నచ్చడం లేదు అన్న మాటకు.. ” నేను వెకేషన్ కు వెళ్తే మీకు నచ్చాల్సిందేముంది అండీ” అంటూ కౌంటర్ ఇచ్చాడు. తన వెకేషన్ తన పర్సనల్ అని మహేష్ చెప్పకనే చెప్పాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి గుంటూరు కారం సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments