Mahesh Babu : మేడమ్ టుస్సాడ్స్.. ప్రపంచంలోనే మైనపు విగ్రహాలకు ఈ మ్యూజియం ఫేమస్. ఇందులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళా కారులు, డైరెక్టర్లు, సింగర్లు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సేవలు అందించిన వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. రీసెంట్ గా రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ నుంచి ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహం ఉన్నది నలుగురికి మాత్రమే. దీన్ని అందరికంటే ముందు మొదలు పెట్టింది ప్రభాస్. బాహుబలితో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ ను.. బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు గుర్తించి విగ్రహం ఏర్పాటు చేశారు.
Read Also : AP Rains: రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు: ఐఎండీ!
ఆ తర్వాత మహేశ్ బాబు విగ్రహాన్ని 2019లో ఏర్పాటు చేశారు. 2024లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు. అయితే ప్రతి హీరో తన మైనపు విగ్రహాన్ని ఆయా దేశాలకు వెళ్లి ఆవిష్కరించారు. కానీ మహేశ్ బాబు విషయంలో మాత్రం ఇది రివర్స్ లో జరిగింది. మహేశ్ బాబు విగ్రహాన్ని సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో తయారు చేశారు. దాన్ని ఆవిష్కరించేందుకు ఆ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్ కు ప్లైట్ లో తీసుకువచ్చారు. ఒక హీరో విగ్రహాన్ని మ్యూజియం నుంచి అతను ఉన్న దగ్గరకు తీసుకురావడం కేవలం మహేశ్ విషయంలో మాత్రమే జరిగింది. ఆ రికార్డు ఇప్పటికీ మహేశ్ పేరు మీదనే ఉంది.
Read Also : HIT 3 : ఈస్ట్ గోదావరిలో హిట్-3 లాభాలు.. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ..
