Site icon NTV Telugu

Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా జటాధార ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే..?

Jatadara

Jatadara

హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కొత్త కాన్సెప్ట్ చూపడం కోసం ముందుండే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మామ సూపర్ స్టార్ కృష్ణ, బావ మహేష్ బాబుకి సైడ్ లైన్ అయినా, సుధీర్ బాబు తన సొంత కాళ్లపై నిలబడ్డాడు. ప్రతీ సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు వస్తూ ఆడియెన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాడు.

Also Read : Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

కానీ, ఈ మధ్యకాలంలో సుధీర్ బాబు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్ లో నిలవలేకపోతున్నాయి. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై పట్టు తప్పడం లేదా ఇతర కారణాల వల్ల వీటిని పెద్దగా ఆడియన్స్ స్వీకరించలేదు. ఇప్పుడు సుధీర్ బాబు సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే ‘జటాధర’. ఇప్పటివరకు సుధీర్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే అయినా, ‘జటాధర’పై జనాల్లో అసాధారణమైన క్యూరియాసిటీ నెలకొంది. రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం.. రేపు మహేష్ బాబు చేతుల మీదుగా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో ఉంది. నెటిజన్లు కూడా “మహేష్ బాబు సపోర్ట్ అంటే సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్” అని కామెంట్ చేస్తున్నారు.

 

Exit mobile version