సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ శ్రీమంతుడు తన ఉదార గుణంతో మరిన్ని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చికిత్స అందించడానికి మహేష్ ఇప్పుడు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మహేష్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో 2 లక్షల మంది పిల్లలు దానితో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలకు ఈ ప్రత్యేక కార్యక్రమం కింద చికిత్స అందిస్తున్నారు.
Read Also : Radhe Shyam Pre Release Event : పూజాతో విబేధాలు.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
అంతకుముందు మహేష్ ఆంధ్రా హాస్పిటల్ నేతృత్వంలో గుండె శస్త్రచికిత్సలు చేయించారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 1000 మందికి పైగా పిల్లలు ప్రయోజనం పొందారు. ఆర్థిక బలం లేని జబ్బుపడిన పిల్లలను ఆదుకునే లక్ష్యంతో ఉన్న హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్‌తో కూడా మహేష్ కు అనుబంధం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను మహేష్ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల్లో బస్ షెల్టర్లు, మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం, పునరుద్ధరణ, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం వంటి మౌలిక వసతులు కల్పించే బాధ్యతను మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుంది. మొత్తానికి మన శ్రీమంతుడు పరోపకార కార్యక్రమాల్లో మునిగితేలుతూ నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు.
