NTV Telugu Site icon

Mahesh Babu: చొక్కా సింపుల్ గా ఉందని తక్కువ రేటు అనుకునేరు.. మన ఒక నెల జీతం

Mahesh

Mahesh

Mahesh Babu: సెలబ్రిటీలు.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వారు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అభిమాన హీరోలను.. వారి లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలామంది యువత ట్రై చేస్తూ ఉంటారు. ఆ హీరో హెయిర్ కట్ ట్రై చేయాలి.. ఈ హీరోలా కండలు పెంచాలి. ఆ హీరో వేసుకున్న షర్ట్ కొనాలి.. షూస్ కొనాలి అంటూ చెప్పుకురావడం వింటూనే ఉంటాం. అయితే అవి తక్కువ ధర అయితే మధ్యతరగతి వారు కొనగలరు కానీ, అవి వేలు, లక్షల్లో ఉంటే మాత్రం ఇదుగో ఇలా చూసి ఆనందించడమే కానీ, కొనేంత స్తోమత లేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఇప్పుడు ఇదంతా దేనికి అని అంటే.. నిన్న మహేష్ బాబు.. బిగ్ సి 20 వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే. అందులో మహేష్ వేసుకున్న షర్ట్ గురించే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా. మొదటి నుంచి కూడా మహేష్.. ఎక్కువ ఆడంబరాలకు పోడు. బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రెస్ మీట్స్ కు వెళ్ళినప్పుడు కానీ.. చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తాడు.

Vaishnavi Chaitanya: బేబీ.. ఇద్దరబ్బాయిలను మోసం చేసినా.. ఈ విషయంలో నువ్వు తోపు అంతే

ఎలాంటి హడావిడి లేని నార్మల్ షర్ట్స్ తో ఎంతో నిరాడంబరంగా వస్తాడు. అలానే నిన్న కూడా ఒక చెక్స్ షర్ట్ వేసుకొని ఎంతో సింపుల్ గా వచ్చాడు. ఆ షర్ట్ కూడా ఎంతో సింపుల్ గా ఉంది. చూడడానికి షర్ట్ చాలా సింపుల్ గా ఉంది.. మహా అయితే ఎంత ఉంటుంది.. ఓ ఐదు వేలు ఉంటుంది అనుకుంటున్నారేమో.. పొరపాటు.. ఆ సింపుల్ షర్ట్ ధర అక్షరాలా.. రూ.17, 999 మాత్రమే. అంటే రూ.18 వేలు. ఏంటి కళ్లు పెద్దగా మారిపోయాయి కదా. మరి.. డెనిమ్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది. సెలబ్రిటీలకు ఈ అమౌంట్ అంత పెద్ద బరువు ఏం కాదు. కానీ, ఒక మధ్యతరగతి యువకుడు నెల జీతం. దీనికన్నా తక్కువ జీతం తీసుకుంటున్నవారు ఎంతోమంది. ఇక ఈ షర్ట్ విలువ తెలిశాక అభిమానులు కూడా ఇదే మాట అంటున్నారు. చొక్కా సింపుల్ గా ఉందని తక్కువ రేటు అనుకునేరు.. మన ఒక నెల జీతం భయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments