Site icon NTV Telugu

RRR : అతనొక్కడే… మహేష్ బాబు రివ్యూ

rrr

RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం.

Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”… కానీ హిందీలో కాదు !!

“సినిమాలు ఉన్నాయి… అందులో ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు ! #RRR E.P.I.C!! స్కేల్, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్ & ఎమోషన్స్ అనూహ్యమైనవి, ఉత్కంఠభరితమైనవి, అద్భుతమైనవి! మిమ్మల్ని మీరు మరచిపోయి సినిమా అనుభవంలో మునిగిపోయే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఒక మాస్టర్ కథకుడు మాత్రమే ఇలా చేయగలడు !! మాస్టర్ @ssrajamouli సెన్సేషనల్ ఫిల్మ్ మేకింగ్. చాలా గర్వంగా ఉంది సార్!! తారక్, రామ్ చరణ్ తమ స్టార్‌డమ్‌ని మించి ఎదగడంతోపాటు ఈ లోకంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు !! నాటు-నాటు పాటలో గురుత్వాకర్షణ లా కనిపించలేదు! వాళ్ళు అద్భుతంగా చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని అమలు చేసినందుకు #RRR మొత్తం టీమ్‌కి హ్యాట్సాఫ్!! చాలా గర్వంగా ఉంది! అభినందనలు” అంటూ మహేష్ తన సోషల్ మీడియా పేజీలో వరుసగా ట్వీట్లు చేశారు. మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.

Exit mobile version