Site icon NTV Telugu

Mahesh Babu: ఎలా వదులుకోవాలనిపించింది బ్రో.. ఆ సినిమాను.. రికార్డ్ బ్రేక్ చేసేవాడివి తెలుసా.. ?

Ranbir

Ranbir

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాలా.. ? చెప్పండి. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాతో బిజీగా మారనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్, తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు. అందుకు రెండు కారణాలు. కొన్ని డేట్స్ అడ్జెస్ట్ చేయలేక.. ఇంకొన్ని తనకు సూట్ కావని. మొదటి నుంచి మహేష్ పాటిస్తున్న నియమం ఒకటే. కథ ఎలాంటిది.. తనకు సూట్ అవుతుందా.. ? ఆ పాత్రకు తాను న్యాయం చేయగలుగుతానా.. ? అని ఆలోచించడం. కథ విని, నచ్చినా కూడా ఆ పాత్రకు తాను సెట్ కాదని అనిపిస్తే .. నిర్మొహమాటంగా చేయను చెప్పేస్తాడు. అంతేకాదు.. ఆ కథ ఎవరికి సూట్ అవుతుందో కూడా చెప్తాడు. అలా .. మహేష్ వదులుకున్న సినిమాలో లెక్కలేనన్ని. ఇడియట్, గజినీ, లీడర్, ఏ మాయ చేసావే, పుష్ప.. ఇప్పుడు యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో అనుకున్నాడట. మొదట యానిమల్ కథను మహేష్ కే వినిపించాడట. కానీ, మహేష్.. ఆ వైలెన్స్, హీరో క్యారెక్టర్ నచ్చినా.. తనకు అది సూట్ కాదేమో అని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Suriya: సెట్ లో ప్రమాదం.. తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన సూర్య..

ఇక ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూసాక.. రణబీర్ ప్లేస్ లో మహేష్ ఉంటే వేరే లెవెల్ లో ఉండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మహేష్ చేసిన బిజినెస్ మ్యాన్ లో ఉన్న పొగరు, యాటిట్యూడ్ కు కొద్దిగా వైలెన్స్ కలిపితే యానిమల్. ఆ పాత్రలో రణబీర్ జీవించేశాడు. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఆ బంధాన్ని మహేష్ అయితే ఇంకాస్తా పండించేవాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ చూసాక.. ఎందుకు అన్నా.. యానిమల్ ను వదిలేశావ్ .. నువ్వు చేసి ఉంటే రికార్డులు బద్దలు అయ్యేవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డిసెంబర్ 1 న యానిమల్ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Exit mobile version