Site icon NTV Telugu

SSMB 29 : రాజమౌళి-మహేశ్ మూవీపై క్రేజీ అప్డేట్

Ssmb 29

Ssmb 29

SSMB 29 : సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు–దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా గురించి అభిమానుల్లో హైప్‌ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటి నుంచో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్‌ బయSSMB 29 :టకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఈవెంట్ గురించి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 15రోజున సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్టు తెలిపారు.

Read Also : Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్

ఇక ఆ రోజు అభిమానులకు భారీ సర్‌ప్రైజ్‌ ఉండబోతోందన్న టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజమౌళి స్టైల్‌లో రూపొందుతున్న ఈ గ్లోబల్‌ అడ్వెంచర్‌ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్లోబ్ ట్రోటర్ అనే హాష్ ట్యాగ్ తో తాజా పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే వారణాసి అనే టైటిల్ పెడుతారనే ప్రచారం ఉంది. కానీ రీసెంట్ గా ఆ టైటిల్ ను మరో డైరెక్టర్ తన మూవీకి రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో వేరేది పెడుతారా లేదంటే అదే పెడుతారా అనేది చూడాలి.

Read Also : Pawan Kalyan: తుఫాన్ నష్టం, అవనిగడ్డ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ సమీక్ష!

Exit mobile version