Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి అత్యంత అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారు, భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబు (రుద్ర)కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ సినిమా కథ కాలానికి, ఖండాలకు అతీతంగా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సుదీర్ఘమైన కాశీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, అక్కడి ఆధ్యాత్మికతను కెమెరాలో బంధించింది. ఆ తర్వాతే ఈ గ్లోబల్ అడ్వెంచర్ అంటార్కిటికా వైపు మళ్లింది.
తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(మందాకిని)లపై ఒక భారీ సాంగ్ షూట్ కూడా పూర్తయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఆ తర్వాత జూన్ నెలలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో రాజమౌళి అండ్ టీమ్ మెక్సికోలో జరగనున్న Comic Con (CCXP) ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు.
Also Read
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
తాజావార్తలు
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
-
Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
-
AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!