Pokiri Mania Begins: మళ్లీ వెండితెరపైకి పండుగాడు.. సిద్ధమవ్వండి

Pokiri Movie

Pokiri Movie

PokiriManiaBegins: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K ఆల్ట్రా హెచ్‌డీ, డాల్బీ ఆడియో టెక్నాలజీతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మహేష్ అభిమానులు PokiriManiaBegins అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

Read Also: Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?

×
×
Ad

ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో పోకిరి ప్రత్యేక ప్రదర్శనలు వేసేందుకు మహేష్ అభిమాన సంఘాలు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 9న మరోసారి పోకిరి సినిమాను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మూవీలో ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఈ డైలాగ్‌లో పలువురు కమెడియన్‌లు తమ సినిమాల్లో స్పూఫ్‌లు కూడా చేశారు. ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం, మణిశర్మ సంగీతం ఈ మూవీని టాప్‌లో నిలబెట్టాయి. త్వరలోనే పోకిరి మూవీ ప్రీమియర్ షోలకు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో విక్రయించనున్నట్లు సమాచారం.