సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ డైరెక్టర్ మహేష్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేసెస్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ తప్పకుండా తన సినిమా ఉంటుందని, సూపర్ స్టార్ తో ఒక ఫ్రెష్ సబ్జెక్టు తీయబోతున్నట్టు, ఆయన కోసం స్టోరీ కూడా రాసినట్టు సందీప్ వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రాబోతోందని ఈ స్టార్ డైరెక్టర్ చెప్పడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే పోకిరి + అర్జున్ రెడ్డి కలిపి ఓ అద్భుతమైన కల్ట్ మూవీ అవుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Read Also : నీరజ్ చోప్రా బయోపిక్ లో “పవర్” స్టార్ వారసుడు?
ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 2022 జనవరి 13న “సర్కారు వారి పాట” రిలీజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” మూవీ రూపొందనుంది. ఆ తరువాత మహేష్, రాజమౌళి మూవీ లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తవ్వాలంటే ముఖ్యంగా రాజమౌళితో చాలా సమయం పడుతుంది. రాజమౌళి సినిమాకు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం తీసుకుంటాడు. అంటే మహేష్ కోసం సందీప్ రెడ్డి వంగా చాలానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే త్రివిక్రమ్ తో పాటు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసి, తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ ను మహేష్ పట్టాలెక్కించి అవకాశం కూడా లేకపోలేదు.
