నీరజ్ చోప్రా బయోపిక్ లో “పవర్” స్టార్ వారసుడు?

టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నట్లు ఈ అథ్లెట్ ఇంతకు ముందు చెప్పాడు. 2018లో ది క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో (ఆసియా గేమ్స్ తర్వాత) ఒలింపిక్ బంగారు పతక విజేత తన జీవిత చరిత్రలో రణదీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో తాజాగా ఆ ఇద్దరు స్టార్ హీరోల పేర్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

Read also : కర్నూలు “కొండారెడ్డి బురుజు”కు మరో హీరో

అయితే టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం నీరజ్ చోప్రా బయోపిక్ కు పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పర్ఫెక్ట్ అంటున్నారు. ఇటీవల అకీరా కర్రతో విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అఖీరాను చూసిన మెగా అభిమానులు నీరజ్ జావెలిన్ త్రోకు కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా అఖీరా లుక్ నీరజ్ కు దగ్గరగా ఉండడం కూడా ఫ్యాన్స్ కోరికకు కారణమైంది. నీరజ్ బయోపిక్ తో అకీరా ఎంట్రీ ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇక అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై తనకేం అభ్యంతరం లేదని రేణూ దేశాయ్ ఎప్పుడో చెప్పేసింది. అప్పటి నుంచి ఈ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ గురించి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

-Advertisement-నీరజ్ చోప్రా బయోపిక్ లో "పవర్" స్టార్ వారసుడు?

Related Articles

Latest Articles