Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో ఆమెనే హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు SS రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అన్నప్పటినుండి అంచనాలు కూడా మన అంచనాలకు అందకుండా పోయాయి. ఇప్పటికే తెలుగు ఈసినిమా రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న మహేష్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అటు సినీ అభిమానుల్లో అలాగే ఇటు మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వచ్చిన RRR కూడా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా నిలిచింది. ఇక RRR సక్సెస్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అతి త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత KL నారాయణ ఎంతో భారీ స్థాయిలో ఇండియన్ ఫిలిం హిస్టరీ లో నిలిచిపోయే విధంగా భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే మహేష్ సినిమా కోసం ప్రముఖ హీరోయిన్ పేరు ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం గట్టిగా ఉందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభాస్ తో సాహో మూవీ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ధ, అందులోనూ శ్రద్ద ముందునుండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కావడం విశేషం. మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అలాంటి పాత్రకు శ్రద్ధ కపూర్ అయితేనే కరెక్ట్ అని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి వార్త బయటకు రాలేదు.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామా మూవీగా ఇది తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాంటి స్టోరీపై తాము కసరత్తు చేస్తున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు ఇటీవల హాలిడే ట్రిప్ నుండి తిరిగివచ్చిన రాజమౌళి ప్రస్తుతం తండ్రితో కలిసి వరుసగా స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని, అతి త్వరలో స్టోరీ ఫైనలైజ్ కానుంది. ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్తున్నారు. అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సినిమా రావాల్సింది. అయితే కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనప్పటికి భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!