NTV Telugu Site icon

Mahesh Babu: నాన్న.. ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: ఒక్క ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన బాధను మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మహేష్ ను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం. అంతటి దుఃఖాన్ని భరించడం అంటే ఎంతో తెగువ ఉండాలి. దేవుడిలా కొలిచే కన్నతండ్రి మృతిని తట్టుకోలేక గుండెలు అవిసేలా మహేష్ రోదిస్తున్నాడు. ఎంతమంది వచ్చినా మహేష్ ను ఓదార్చడం కావడం లేదు అని వీడియోలు, ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది. ఇక తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ ను అలా చూడడం మొదటిసారి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

తండ్రి కృష్ణ ముఖాన్ని తేరిపార చూస్తూ మహేష్ రోదిస్తున్న ఫోటో అందరి హృదయాలను కలిచివేస్తోంది. నాన్న.. ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ అన్నట్లు మహేష్, కృష్ణ చెవి వద్ద ఏదో అడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన నుదిటిపై ప్రేమతో ముద్దుపెట్టేటప్పుడు ఈ ఫోటోను క్లిక్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ కష్టం పగవాడికి కూడా రాకూడదని, ఇంతటి బాధను ఆయన ఎలా భరించగలుగుతున్నాడు అని మహేష్ అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Show comments