Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను దసరాకు రిలీజ్ చేస్తారని అనుకున్నారు.. కానీ, పండగకు పోస్టర్ తో సరిపెట్టేశారు మేకర్స్. రెండు రోజుల క్రితం గుంటూరు కారం మొదటి సాంగ్ లిరిక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక దీంతో చేసేదేం లేకపోవడంతో అదే పాటను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.
NBK 110 : బాలయ్య 110వ సినిమాను అనౌన్స్ చేశారా? పోస్టర్ ఇదేనా?
ఇప్పటివరకు ఈ సినిమా పోస్టర్స్ అన్ని గమనిస్తే.. ప్రతి పోస్టర్ లో మహేష్ బీడీ కాలుస్తూనే కనిపించాడు. ఒక్క పోస్టర్ లో తప్ప మిగిలిన అన్ని పోస్టర్స్ లో చేతిలో బీడీ లేకుండా అయితే కనిపించలేదు. ఇక దీని అర్ధం.. త్రివిక్రమ్.. మహేష్ ను ఊర మాస్ గా చూపించాలని ఫిక్స్ అయ్యినట్లు ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఒకానొక సమయంలో మహేష్.. స్మోకింగ్ కు ఎడిక్ట్ అయ్యాడు. ఆ తరువాత పూర్తిగా స్మోకింగ్ కు చెక్ పెట్టాశాడు. ఇక ఎప్పుడైనా సినిమాల్లో ఒకటి రెండు సీన్స్ లో సిగరెట్ చేత్తో పట్టుకొని కనిపించేవాడు కానీ, ఇంతలా బీడీని పట్టుకొని కనిపించలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్.. మహేష్ వింటేజ్ లుక్ ను టీయూసుకొస్తాడేమో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.