NTV Telugu Site icon

Mahesh Babu: కొత్త సీఎం కు మహేష్ బాబు అభినందనలు

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ” తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు.. మీరు రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు మరియు అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలకు నడిపించండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికోస్తే.. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.మరి ఈ సినిమాలతో మహేష్ బాబు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.