#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యలో మొదట రవితేజ క్యామియోనే అనుకున్నారట.. ఆ తరువాత స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో కీలక పాత్రగా మారిపోయింది. ఈ క్యామియోలు ఉండడం వలన బెన్ ఫిట్ ఏంటంటే.. సినిమాపై హైప్ రావడం ఒకటే కాదు.. ఇరు హీరోల అభిమానుల సపోర్ట్ లభిస్తుంది. అసలు ఇప్పుడు ఈ క్యామియోల గురించి ఎందుకు అంటే.. ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోస్ ఒకే సినిమాలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.
Sudigali Sudheer: రష్మీ అలాంటింది.. అందుకే నేను ఆమెను..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వస్తున్న చిత్రం OG. డీవీవీ దానయ్య బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక మంచి హైప్ ను తీసుకొచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే.. OG చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్యామియోలో కనిపించనున్నాడట. ఆయన కూడా ఒక గ్యాంగ్ స్టర్ గా కొన్ని నిమిషాలు పవన్ తో కలిసి నటించనున్నాడని సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ఇలాంటి హైప్ పెట్టుకొని సినిమాకు వెళ్తే అభిమానులు చచ్చిపోతారని సరదాగా చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది సుజీత్ మాత్రమే చెప్పాలి.