SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా ఎస్ ఎస్ ఎంబీ 29. ఈ సినిమాకు ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అదో సంచనలమే అవుతోంది. ఈ మూవీని అడ్వెంచర్ జోనర్ లో తెస్తున్నామని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. కాగా ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో భారీ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడంట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే అయిపోయిందని తెలుస్తోంది. ఈ మూవీ కథలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయంట.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ సంచలన రికార్డు.. టాలీవుడ్ లో తొలి హీరో
ప్రకృతి విషయంలోనే మహేశ్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సనాతన ధర్మం, మన పురాణాలను బేస్ చేసుకుని చాలా సీన్లు తీస్తున్నాడంట రాజమౌళి. హిందువులు ప్రకృతిని దైవంగా పూజిస్తారనే విషయం తెలిసిందే. ఆ దైవత్వాన్ని ప్రకృతి రూపంలో చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సింక్ అయ్యే సీన్లు రాసుకున్నాడంట రాజమౌళి. ఈ మూవీతో మరోసారి తన మార్క్ ను చూపించబోతున్నట్టు తెలుస్తోంది. కాకపోతే రాజమౌళి ఏం చేసినా దాని వెనకాల బలమైన కారణాలు ఉంటాయనే విషయం తెలిసిందే. బలమైన కథ, కథనం నడిపించడంలో రాజమౌళి దిట్ట. ఈ మూవీ విషయంలోనూ అదే జరగబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..
