Site icon NTV Telugu

టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్

Mahesh Babu And Tiger Shroff Come Together for Ad

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో విపరీతమైన ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అలాంటిది మన సూపర్ స్టార్ మరో బాలీవుడ్ స్టార్ స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? ఇప్పటికే మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీలో నటించారు. అయితే అది మన టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో. కానీ బాలీవుడ్ స్టార్ తో మహేష్ కన్పించడం అనే విషయం ఇప్పుడు మహేష్ అభిమానుల్లో హుషారును పెంచేస్తోంది. మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించారు. అయితే అది సినిమా కోసం కాదు ఒక యాడ్ కోసం.

Read Also : ఆ గ్యాప్ లో “ఏజెంట్” దర్శకుడితో నితిన్ మూవీ

మహేష్ బాబుకు సౌత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకు భారీగా పారితోషికం ఇచ్చి మరీ యాడ్లలో నటింపజేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన థమ్స్ అప్ యాడ్, మిగతా యాడ్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో బ్రాండ్ యాడ్ కు కూడా ఆమోదం తెలిపాడు. ఈ యాడ్ మౌత్ ఫ్రెషనర్ బ్రాండ్ కు సంబంధించింది. కమర్షియల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. వారిద్దరినీ ఒకే తెరపై కలిసి చూడడం ఇద్దరు నటీనటుల అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. ఈ కమర్షియల్ యాడ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా ? అని వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మహేష్ మరో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్ తో కలిసి యాడ్ లో నటించిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by PanBahar_Elaichi (@panbahar_elaichi)

Exit mobile version