SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటి వరకు కెన్యాలోని భయంకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ను చేశారు. అక్కడ సింహాలతో చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కెన్యా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది ఈ మూవీ టీమ్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. అందులో మెయిన్ స్టార్స్ మీద కీలక సీన్లు తీస్తున్నారు. రాజమౌళి కొన్ని సీన్లను స్పెషల్ గా డిజైన్ చేశాడని తెలుస్తోంది.
Read Also : Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
ఆ సీన్లనే ఇప్పుడు తీస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని తర్వాత మరో కొత్త ప్లేస్ లో మూవీ షూట్ ఉంటుందని తెలుస్తోంది. అది అయిపోగానే మళ్లీ భయంకరమైన అడవుల్లో షూటింగ్ ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అదంతా ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. నవంబర్ లో మూవీ షూటింగ్ ఉండబోతోంది. అప్పుడు మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే సబ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మూవీ టీమ్.
Read Also : Nidhi Agarwal : చీరకట్టులో వయ్యారాలు వొలికిస్తున్న నిధి పాప..
