Site icon NTV Telugu

SSMB28 : తమిళ స్టార్ లేడట… పుకార్లకు ఫుల్ స్టాప్

SSMB28

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్ ఏమిటంటే… తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను #SSMB28లో ఓ కీలకపాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో విక్రమ్ నెగెటివ్ రోల్ లో కన్పించవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా విక్రమ్ వర్గం నుంచి ఈ రుమార్ పై క్లారిటీ రావడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Read Also : Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

హీరో విక్రమ్ మేనేజర్ తన ట్విట్టర్ లో విక్రమ్ #SSMB28లో కనిపించడం లేదని ప్రకటించారు. “డియర్ ఫ్రెండ్స్, #ChiyaanVikram @urstrulyMaheshతో ఏ ప్రాజెక్ట్‌లోనూ భాగం కాదు. దీనికి సంబంధించి వస్తున్న పుకార్లు నిరాధారమైనవి. అటువంటి వార్తలను ప్రచురించే ముందు దయచేసి మమ్మల్ని సంప్రదించాలని నేను మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను. అభినందనలు’ అని సూర్యనారాయణన్ ట్వీట్ చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడింది.

Exit mobile version