Site icon NTV Telugu

Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్

Mahavatar

Mahavatar

Mahavathar Narasimha : యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా దుమ్ము లేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయని.. ఇండియాలో ఆడవనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. తాజాగా మరో మైలు రాయిని అందుకుంది.

Read Also : Jagapathibabu : జగపతి బాబు టాక్ షోకు సంచలన దర్శకులు..

ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు నిర్మాణ సంస్థ హోంబలే అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ తీసిన ఈ యానిమేషన్ మూవీని రూ.40 కోట్లతో తీశారు. ఈ సినిమాలో నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. అశ్విన్ కుమార్ నాలుగేళ్ల పాటు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని తీసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించింది. పెద్ద స్టార్ల సినిమాలు థియేటర్ల నుంచి తీసేసినా.. ఈ సినిమా మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది.

Read Also : Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..

Exit mobile version