Mahavatar Narsimha : థియేటర్లలో ప్రస్తుతం మూడు సినిమాల గురించి చెప్పుకోవాలి. రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ కూలీ. హృతిక్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన మూవీ వార్-2. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్, భారీ ఫ్యాన్ బేస్ తో వచ్చాయి. ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుతూ జీవోలు కూడా ఇచ్చాయి. అయినా సరే ఈ రెండింటినీ తొక్కి పడేసింది మహావతార్ నరసింహా మూవీ. రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా సరే ఇప్పటికీ బుక్ మై షోలో గంటుకు ఆరువేల టికెట్లకు పైగా అమ్ముడు పోతోందంటే మామూలు విషయం కాదు. సాధారణంగా సినిమాలకు వెళ్లాలంటే సెలవు రోజులు ఎప్పుడు ఉన్నాయా అని వెతుక్కుని వెళ్తారు.
Read Also : Nara Rohith : వార్-2 ఇష్యూపై స్పందించను.. ఎన్టీఆర్ తో మూవీ చేస్తా : నారా రోహిత్
వార్-2, కూలీ విషయంలో ఇదే జరుగుతోంది. కానీ నరసింహా మూవీకి మాత్రం పనిగట్టుకుని మరీ వెళ్తున్నారు. కూలీ సినిమాకు గంటకు 5వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. వార్-2కు గంటకు 3వేలకు పైగా బుక్ అవుతున్నాయి. ఈ రెండూ మహావతార్ కు దరిదాపుల్లో కూడా లేవు. ఇంత పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడక్షన్ సంస్థలు, విపరీతమైన ఫ్యాన్ బేస్.. ఇవన్నీ ఉన్నా సరే ఈ రెండు సినిమాలను నెల రోజుల క్రింద వచ్చిన మహావతార్ తొక్కి పడేస్తోంది. థియేటర్ లో చూడాల్సిన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లలోనే మూవీ చూస్తారనే దానికి ఈ సినిమానే ఉదాహరణ. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ మూవీ థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది. వార్-2, కూలీ సినిమాలను ఓటీటీలో చూద్దాం అన్నట్టు ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. పైగా టికెట్ రేట్లు వార్-2, కూలీ మూవీలకు చాలా ఎక్కువ. మహావతార్ మూవీకి సాధారణ రేట్లు ఉండటం కూడా కలిసొచ్చింది.
Read Also : Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు
