Mahavatar Narsimha : మహావతార్ నరసింహా మూవీ దిగ్విజయంగా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే తీసుకొచ్చిన ఈ యానిమేషన్ మూవీని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెళ్తున్నారు. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా మూవీ విషయంలో తన కష్టాలను వివరించాడు డైరెక్టర్. ఈ సినిమా చేస్తున్నప్పుడు తనను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయన్నారు.
Read Also : Keerthi Bhat : వాళ్ల లాగా పొట్టిబట్టలు వేసుకుంటేనే ఛాన్సులు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం
ఐదేళ్ల క్రితం సినిమాను స్టార్ట్ చేశాం. మా దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేశాం. ముందు అనుకున్న బడ్జెట్ కంటే స్టార్ట్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది. దాంతో కారు, ఇళ్లును కూడా అమ్మేసి సినిమాకే పెట్టాము. నా భార్య నగలు కూడా అమ్మేశాను. నెలాఖరు వచ్చేసరికి టీమ్ జీతాలు ఇవ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. చాలా మంది దగ్గరకు వెళ్లి ఇన్వెస్ట్ చేయాలని అడిగాం. వంద మంది దాకా నిర్మాతలు చేస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. చివరకు ఎలాగోలా సినిమాను కంప్లీట్ చేశాం. దీన్ని రిలీజ్ చేయకముందు చాలా మంది నెగెటివ్ గానే మాట్లాడారు. దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారన్నారు. అప్పుడు మేం ఒకటే అనుకున్నాం. సినిమా పోతే దేవుడి కోసమే కదా.. మళ్లీ వీఎఫ్ ఎక్స్ పనులు చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు అశ్విన్ కుమార్.
Read Also : Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
