Site icon NTV Telugu

Bigg Boss 9 : వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. భరణిపై మాధురి కామెంట్స్

Bigg Boss 9

Bigg Boss 9

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మాధవి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు నేషనల్ క్రష్ రష్మిక వచ్చేసింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజిమీదకు వచ్చింది రష్మిక. ఆమె వచ్చిన సందర్భంగా నాగార్జున హౌస్ మేట్స్ తో ఓ ఫన్ గేమ్ ఆడించారు. కొన్ని సినిమాల్లోని సీన్స్ ను చూపించి వాటిని రీ క్రియేట్ చేయాలని చెప్పాడు.

Read Also : Eggs: గుడ్లు, మాంసం ఉత్పత్తిలో వెనుకబడ్డ భారత్.. ప్రతి భారతీయుడికి ఏడాదికి 180 గుడ్లు అవసరం, ఉత్పత్తి 103 మాత్రమే

ఈ క్రమంలోనే అదుర్స్ సినిమాలోని కామెడీ సీన్ ను రీ క్రియేట్ చేయమని భరణి, మాధురికి చెప్పాడు. దీంతో మాధురి.. ‘ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. ప్రేమ’ అంటూ బ్రహ్మానందం క్యారెక్టర్ చేసిన భరణిని అనింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. అందరికీ సిక్స్ ప్యాక్ లు ఏమైనా ఉన్నాయా అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు ప్రేమ గురించి అంటుంది మాధురి. నువ్వుంత హార్ష్ గా మాట్లాడకు చందు.. నేను హర్ట్ అవుతాను అంటాడు భరణి. ఇంతలోనే బామ్మ క్యారెక్టర్ చేసిన సంజనా నవ్వుతుంటే.. ఛీ..ఛీ.. మీరలా సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు భరణి. ఇలా ఫన్నీగా సాగింది ఎపిసోడ్.

Read Also : Botsa Satyanarayana: ప్రభుత్వంలోని పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాయి..

Exit mobile version