Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. ఇక హోస్ట్ గురించి పక్కన పెడితే.. ఈసారి కంటెస్టెంట్స్ ను కూడా మంచి మంచి సెలబ్రిటీలను దించుతున్నారని టాక్ నడుస్తోంది. అందులో నటి మాధవీ లతా పేరు కూడా వినిపిస్తుంది. నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వివాదాలతోనే బాగా ఫేమస్ అయ్యింది. ఇక గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ లోకి ఆమె అడుగుపెడుతుందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమె అడుగుపెడితే వివాదాలకు ఎలాంటి లోటు ఉండదని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bhola Shankar: భోళా శంకర్ సెకండ్ సింగిల్.. ప్రతి పెళ్ళిలో మోగేలానే ఉందే
ఇక పోతే ఈ వార్తలపై మాధవీ స్పందించింది. తాను బిగ్ బాస్ లోకి వస్తున్నా అన్న వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. “డియర్ ఫాలోవర్స్.. బిగ్ బాస్ యాజమాన్యం నన్ను కలిశారు అన్నది నిజం. ఇప్పుడే కాదు .. మూడుసార్లు వారు నన్ను కలిశారు. నేను సున్నితంగా నో చెప్పాను. బిగ్ బాస్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు. నన్ను అప్ప్రోచ్ అయినందుకు బిగ్ బాస్ కు థాంక్స్. ఇక ప్రేక్షకులకు నా పేరు అనుకున్నందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు బిగ్ బాస్ లోకి వస్తే బావుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.