రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రా.కార్తిక్ రచించి దర్శకత్వం వహించిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బా కి దక్షిణ కొరియాకు వెళ్లాలని కల ఉంది. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు రా.కార్తిక్ మాట్లాడుతూ, “కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. అదే ప్రేరణతో ఈ కథను రూపొందించాను. ‘మేడ్ ఇన్ కొరియా’ హత్తుకునే స్లైస్-ఆఫ్-లైఫ్ చిత్రం.
Also Read:Kalyan Ram: మరోసారి కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కల్యాణ్ రామ్
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ప్రియాంక మోహన్ నటిస్తూ, శెన్బా భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడు పార్క్ హ్యే-జిన్‌తో పాటు నో హో-జిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తన పాత్ర గురించి ప్రియాంక మోహన్ మాట్లాడుతూ, “శెన్బా కలలు ఆశ్చర్యం, ఆసక్తి నుంచి పుట్టినవి. కథ మొదట వినగానే నాకు ఆ పాత్రతో బలమైన అనుబంధం ఏర్పడింది. నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో భాగం కావడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
