NTV Telugu Site icon

Chrisann Pereira: టాయిలెట్ వాటర్‌తో కాఫీ.. డిటర్జెంట్ సబ్బులో జట్టు కడుక్కున్న.. జైలు కష్టాలు చెప్పిన బాలీవుడ్ నటి

Chrisann Pereira

Chrisann Pereira

Chrisann Pereira: డ్రగ్స్ కేసులో షార్జా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా తన జైలు అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆమె యూఏఈ జైలులో శిక్ష అనుభవిస్తోంది. జైలులో తన జుట్టును డిటర్జెంట్ సబ్బుతో కడుకున్నానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తయారు చేసిన విషయాలని ఓ లేఖలో వెల్లడించింది. 26 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం సాయంత్రం విడుదలైన క్రిసాన్ త్వరలోనే ఇండియా చేరుకోనున్నారు.

Read Also: SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..

జైలులో తనకు పెన్ను, పేపర్ దొరకడానికి మూడు వారాల ఐదురోజు పట్టింది. నేను టైడ్ సబ్బుతో జట్టును కడుక్కుని, టాయిలెట్ వాటర్ ఉపయోగించి కాఫీ చేసిన తర్వాత,కొన్ని సార్లు కన్నీళ్లు కారుస్తూ బాలీవుడ్ సినిమాలు చూశానని, నా ఆశయం నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని తెలుసని, కొన్నిసార్లు మన సంస్కృతి, మన సినిమాలు, టీవీలో తెలిసి ముఖాలను చూసి నవ్వుతాను, నేను భారతీయురాలిగా, భారత సినిమా ఫీల్డ్ కు చెందినందుకు గర్వపడుతున్నానని ఆమె లేఖలో రాసింది. తన కుటుంబం, స్నేహితులకు, పోలీసులకు, చర్చి, మీడియా తనను అమాయకురాలని నమ్మినందుకు థాంక్స్ చెప్పింది. మాన్‌స్టర్స్ ఆడే థర్టీ గేమ్ లో బలిపశువుగా మారానని అమె చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిజమైన నేరస్థులను అరెస్ట్ చేయడానికి సహరించిన అందరికి కృతజ్ఞుతలను తెలియజేశారు. ఈ స్కామ్ లో చిక్కుకున్న నాతోపాటు ఇతర అమాయకుల ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం ఎల్లప్పుడు గెలుస్తుందని ఆమె లేఖలో పేర్కొంది.

బోరివలికి చెందిన బేకరీ యజమాని ఆంథోని పాల్(35) డ్రగ్స్ కేసులో క్రిసాన్ ను ఇరికించాడు. దీంతో ఆమెను యూఏఈ పర్యటనలో ఉండగా ఏప్రిల్ 1న షార్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంథోని పాల్ స్నేహితుడు రాజేష్ బోరాటే టాలెంట్ మేనేజర్ రవిగా నటించాడు. గతంలో సడక్ 2, బాట్లా హౌజ్ వంటి చిత్రాలకు పనిచేసినట్లు ఆమెను సంప్రదించాడు. బోరాటే రవిగా నటిస్తూ.. షార్జాలో అంతర్జాతీయ వెబ్ సిరీస్ ఆడిషన్ కోసం హాజరు కావాలని క్రిసాన్ ను కోరారుడ. దీంతో ఆమె షార్జా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంది. ఆమె వెళ్తున్న క్రమంలో డ్రగ్స్ తో కూడిన ఓ మెమెంటోను పథకం ప్రకారం ఆమెకు ఇచ్చాడు. నిందితులు షార్జా పోలీసులకు సమాచారం ఇచ్చి క్రిసాన్ అరెస్ట్ అయ్యేలా పథకం వేశారు. క్రిసాన్ పెరీరా తల్లితో జరగిన గొడవ కారణంగా ఆంథోని పాల్ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇలా పథకం ప్రకారం నటి క్రిసాన్ పెరీరాను ఇరికించాడు.