నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ హిట్ కావడం, ట్రైలర్, సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఆడియెన్స్ లో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం.
Also Read : Robinhood : రాబిన్ హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్ టాక్
మేకర్స్ ముందునుండి చెప్తున్నట్టు ఈ సినిమాలో కథ అని ఏమి ఉండదు. ఉండేదల్లా నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, చిన్న చిన్న పంచ్ లు. ఇవే మ్యాడ్ సినిమాను సూపర్ హాట్ కావడానికి దోహదం చేసాయి. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లోను అంటె కథ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లడ్డు పెళ్లి ఎపిసోడ్ హిలేరియస్ గా సాగింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ కామెడీ నవ్వించింది. కానీ సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ కాస్త నెమ్మదించడంతో పాటు ఫోర్స్డ్ గా అనిపించింది. స్వాతి రెడ్డి సాంగ్ మాస్ అదనపు ఆకర్షణ. లీడ్ క్యారెక్టర్స్ తమ తమ పరిధిలో మెప్పించారు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ఒక సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా అని ఓవర్సీస్ నుండి వినిపిస్తున్న టాక్.