ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ‘మా’ సభ్యులందరికీ ఇప్పటికే సందేశాలు పంపించారు. మరోవైపు.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, డీఆర్సీ సభ్యులు మోహన్ బాబు.. సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలను ఆహ్వానించినట్టు తెలుస్తోంది..
also read : గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
ఇక, నందమూరి బాలకృష్ణ లాంటివారిని స్వయంగా కూడా కలిశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిశారా లేదా ఆహ్వానించారా అనేదానిపై క్లారిటీ లేకపోయినా.. నిన్న పవన్ కల్యాణ్‌ను మంచు మనోజ్ కలిశారు. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన మనోజ్ పవన్‌తో సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించారు.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. కానీ, ప్రమాణస్వీకారం ప్రస్తావన వచ్చినట్టుగా మాత్రం సమాచారం లేదు. మరోవైపు.. మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే.. బాధ్యతలను స్వీకరించారు మంచు విష్ణు.. 2015 నుంచి అధ్యక్షపదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతల్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుండగా.. దానిని బ్రేక్ చేసిన విష్ణు.. ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు. ఇక, ప్రకాష్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన అంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. రేపటి కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
