NTV Telugu Site icon

Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…

Ma Bava Manobhavalu

Ma Bava Manobhavalu

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ‘మా బావ మనోభావాలు’ అంటూ బయటకి వచ్చేసింది. బాలయ్య ఎనర్జీకి, ఇప్పుడున్న పార్టీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ ని దించిన మేకర్స్, ఫాన్స్ లో మంచి జోష్ నింపారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కి, తమన్ ఇచ్చిన మాస్ ట్యూన్ కి… సింగర్స్ సాహితి, యామిని, రేణు కుమార్ వాయిస్ లు ప్రాణం పోసాయి. ఒక పర్ఫెక్ట్ ఐటెం సాంగ్ కి ఎగ్జాంపుల్ లా ఉన్న ‘మా బావ మనోభావాలు’ పాటకి మెయిన్ హైలైట్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్. బాలయ్య ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ నందమూరి అభిమనులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. లిరికల్ సాంగ్ కే ఇంత జోష్ ఇస్తే, థియేటర్ లో అభిమానుల మధ్య ఈ సాంగ్ ని చూస్తే బాలయ్య ఫాన్స్ చేసే రచ్చకి థియేటర్ టాప్ లేచిపోయినా ఆశ్చర్యం లేదు.

Read Also: Nandamuri Fans: ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’ చేసారు… ఇదెక్కడి అరాచకం మావా

‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో చంద్రిక రవి, హనీ రోజ్ లు దుమ్ములేచే రేంజులో డాన్స్ చేస్తే… బాలయ్య నేనేమి తక్కువ కాదు అంటూ డాన్స్ కుమ్మేసాడు. ముఖ్యంగా రెండు లెగ్ మూమెంట్స్ అయితే అందరితో జై బాలయ్య అనిపించే రేంజులో ఉన్నాయి. ‘మా బావ మనోభావాలు’ సాంగ్ వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ కి కొత్త ఊపు తెచ్చింది. ఈ క్రెడిట్ పూర్తిగా తమన్, రామజోగయ్య శాస్త్రి, శేఖర్ మాస్టర్, బాలయ్యలకి మాత్రమే దక్కుతుంది. ఇప్పటివరకూ వీర సింహా రెడ్డి ఆల్బం నుంచి రెండు పాటలు వచ్చాయి కానీ ఆ రెండు పాటలు కథతో లింక్ అయినవి, కథనంతో పాటు చూస్తే ఎంజాయ్ చేసేవి. ఈ మూడో ఆటమ్ బాంబ్ మాత్రం అలా కాదు, సెలబ్రేషన్స్ ఉంటే చాలు మోతమోగించొచ్చు. జనవరి 12న థియేటర్స్ లో వీడియో సాంగ్ చూసే ముందు ఇప్పుడు ఆడియో సాంగ్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.

Read Also: Shruti Haasan: ఆయనతో వర్క్ చేయడం వేరే లెవల్ అంటున్న శృతిహాసన్.. ఇంతకీ ఆయనెవరు?

Show comments