Ma Inti Bangaram OTT Update : సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి తొలి రోజే పాజిటివ్ టాక్ లభించడంతో, ఓటీటీ విడుదల ఎప్పుడు? ఏ ఓటీటీలో ? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’కు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ముందుగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని నమోదు చేసింది.
తొలి రోజు వసూళ్ల పరంగా ‘మా ఇంటి బంగారం’ కొత్త రికార్డులు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బలమైన ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, సమంత నటన, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో వీకెండ్‌లో కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా ఓటీటీ హక్కులపై కూడా స్పష్టత వచ్చింది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు డిజిటల్‌లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిజిటల్ ప్రేక్షకులు.
ప్రస్తుతం స్ట్రీమింగ్ తేదీని ఆఫీషియల్ గా ప్రకటించకపోయినా, థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత, దాదాపు నాలుగు వారాల వ్యవధిలో ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తున్న ఈ చిత్రం డిజిటల్ గా చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

