NTV Telugu Site icon

Tollywood : రానా నాయుడు డైరెక్టర్ కు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్

Suparn Varma

Suparn Varma

తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది.

Also Read : VidaaMuyarchi : ‘కింగ్ ఆఫ్ కలెక్షన్స్’కు కేరాఫ్ అడ్రెస్ అజిత్ కుమార్..

అయితే ఇప్పుడు జాంబీ రెడ్డికి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కానీ జాంబీ రెడ్డి- 2 దర్శకత్వ భాద్యతల నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు. ఈ సీక్వెల్ కు ప్రశాంత్ వర్మ ఓన్లీ కథ మాత్రమే అందిస్తున్నాడు. జాంబీ రెడ్డీ 2 కు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన రానా నాయుడుకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు జంబి రెడ్డి సీక్వెల్ తో  టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు  అలాగే జాంబీ రెడ్డి సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఆపిల్ ట్రేస్ బ్యానర్ నుండి జాంబీ రెడ్డి 2 చేతులు మారింది. ఈ సీక్వెల్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. పాన్ ఇండియా భాషలలో భారీ బడ్జెట్ పై గ్రాండ్ స్కేల్ లో ఈ సీక్వెల్ ను నిర్మించనున్నాడు నాగవంశీ. త్వరలోనే ఇందుకు సంబందించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. మరి సుపర్ణ్ వర్మ కు టాలీవుడ్ లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.