Site icon NTV Telugu

Lucky Baskhar: మన లెఫ్టినెంట్ రామ్.. ఇప్పుడు లక్కీ భాస్కర్ గా వస్తున్నాడు..

Ram

Ram

Lucky Baskhar: భాషతో సంబంధం లేకుండా కథ నచ్చినా.. నటన నచ్చినా సినిమానే కాదు నటీనటులను కూడా తెలుగువారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయాడు. సీతారామం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను అన్నిభాషల్లో చేసుకుంటూ పోతున్నాడు. సీతారామం తరువాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్.

గ‌త ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దుల్కర్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. చుట్టూ డబ్బు కట్టలు.. మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకొని, నీట్ గా మధ్య పాపిడి తీసుకొని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ కనిపించాడు. పోస్టర్ ను బట్టే ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. సార్ కు సంగీతం అందించిన జీవి ప్రకాషే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ అమ్మాడి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version