LR Eswari: మాయదారి సిన్నోళ్ళపై మత్తు చల్లిన ఎల్.ఆర్.ఈశ్వరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LR Eswari: “మాయదారి సిన్నోడు… మనసే లాగేసిండు…” అంటూ ‘అమ్మమాట’ సినిమాలో జ్యోతిలక్ష్మి చిందేసిన పాట ఆ రోజుల్లో భలేగా కనువిందు చేసింది. ఆ పాట పాడిన ఎల్.ఆర్.ఈశ్వరి రసికుల మనసులు ఇట్టే లాగేసింది. జనం చెవులకు ఆనందం కలిగిస్తూ తనదైన పంథాలో పయనించిన ఎల్.ఆర్.ఈశ్వరి ‘స్వరభాస్వరం’గా పేరొందారు. తెలుగునాట అనేక చిత్రాల్లో ఎల్.ఆర్.ఈశ్వరి గానం ఓ ఎస్సెట్ గా నిలచింది. ఇప్పటికీ ఈశ్వరి పాట వింటే చాలు ఆ నాటి అభిమానులు మెలికలు తిరిగిపోతూ ఉంటారు. అదీ ఎల్లార్ ఈశ్వరి గళంలోని మత్తు- అదో గమ్మత్తు – అందులోనే ఉంది మహత్తు!
ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ రాజేశ్వరి. 1939 డిసెంబర్ 8న ఎల్.ఆర్.ఈశ్వరి జన్మించారు. ఆమె తల్లి కూడా పాటలు పాడేవారు. తమిళ చిత్రాలలో గ్రూప్ సింగర్ గా ఆమె జీవనం సాగించేవారు. తరువాతి రోజుల్లో ఎల్.ఆర్.ఈశ్వరి సైతం కోరస్ సింగర్ గా చిత్రసీమలో ప్రవేశించారు. ఆమెలోని గాయనిని ముందుగా గుర్తించిన వారు ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకులు పి.ఆదినారాయణ రావు. తాను స్వరకల్పన చేసిన ‘సువర్ణసుందరి’లో “పిలువకురా… అలుగకురా…” పాటలో ఆమెతో కోరస్ పాడించారు. తరువాతి రోజుల్లో ఎమ్.ఎస్.విశ్వనాథన్, కేవీ మహదేవన్, టి.వి.రాజు, రమేశ్ నాయుడు, సత్యం, చక్రవర్తి వంటివారు ఎల్.ఆర్.ఈశ్వరికి విరివిగా అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అనగానే అందరు సంగీత దర్శకులు ఎల్.ఆర్.ఈశ్వరి పేరునే పలవరించేవారు. అందుకు తగ్గట్టుగానే ఈశ్వరి తన గాత్రంతో మాయ చేసి మురిపించేవారు. ఆ నాటి మేటి ఐటమ్ గాళ్స్ అందరికీ ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడి పరవశింప చేశారు. అయితే జ్యోతిలక్ష్మి ఆటకు, ఎల్.ఆర్.ఈశ్వరి పాటకు జోడీ కుదిరి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
- Nana Patekar Slap Incident : నానాపటేకర్ నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
జానపద చిత్రాల్లోనూ ఎల్.ఆర్.ఈశ్వరి గానం చిత్రవిచిత్రాలు చేసింది. ముఖ్యంగా జానపద బ్రహ్మ బి.విఠలాచార్య రూపొందించిన అనేక చిత్రాలలో ఎల్.ఆర్.ఈశ్వరి పాట భలేగా మురిపించింది. చిత్రమేమంటే, యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన ‘పిడుగు రాముడు’లో ఓ సన్నివేశంలో యన్టీఆర్ ఆడవేషం వేషం వేస్తారు. ఆ సందర్భంలో చోటు చేసుకున్న “రంగులు రంగులు…” పాటలో యన్టీఆర్ కు ఎల్.ఆర్.ఈశ్వరి గానం చేయడం విశేషం! తొలుత కీ రోల్స్ లో నటిస్తూ రాణించిన వాణిశ్రీ, కాంచన, వెన్నిరాడై నిర్మల వంటివారికి సైతం ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రమే ఆదరువుగా నిలచింది. ఐటమ్ గాల్స్ కే పాటలు పాడే ఎల్.ఆర్.ఈశ్వరిని కొందరు గాయనీమణులు చిన్నచూపు చూసేవారు. ఐటమ్స్ పాడే అమ్మాయికి సంగీతం ఏమి తెలుసు, విలువలు ఏమి తెలుసు అంటూ ఎద్దేవా చేసేవారు. అయితే అదే గాయనీమణులు తరువాతి రోజుల్లో ఎల్.ఆర్.ఈశ్వరి బాటలోనే పయనిస్తూ ఈమెకు ఛాన్స్ ఇవ్వకుండా ఐటమ్ సాంగ్స్ పాడారు. అదీ ఆమె బాణీలోనే పాడి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అదే తాను సాధించిన విజయం అంటూ ఎల్.ఆర్.ఈశ్వరి గొప్పగా చెప్పుకొనేవారు. కొన్ని చిత్రాలలో హీరోయిన్స్ కు సైతం ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడి అలరించారు. కొంతమంది కేరెక్టర్ యాక్టర్స్ కు భక్తిగీతాలూ ఆలపించారు. నిజజీవితంలోనూ ఎల్.ఆర్.ఈశ్వరి పలు భక్తి పాటలు పాడి ఆకట్టుకున్నారు.
ఈశ్వరి అమ్మ అంటూ సంగీతకళాకారులు అభిమానంగా పిలుచుకొనే ఎల్.ఆర్.ఈశ్వరి అభిమానుల అభిలాష మేరకు కొన్ని చిత్రాలలో ఎల్.ఆర్. ఈశ్వరిగానే కనిపించారు. తెలుగులో మంచి విజయం సాధించిన ‘కిక్’ ఆధారంగా తమిళంలో రూపొందిన ‘తిల్లాలంగడి’ చిత్రంలో ఓ సీన్ లో ఎల్.ఆర్.ఈశ్వరి కనిపించి ఆకట్టుకున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘మూకుత్తి అమ్మన్’లోనూ ఎల్.ఆర్.ఈశ్వరి కనిపించారు. ఈ సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా అనువాదమయింది. 83 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఎల్లార్ ఈశ్వరి గానాన్ని ఆ నాటి మాయదారి సిన్నోళ్ళు మరచిపోలేరు. వారి మనసులు లాగేసిన ఈశ్వరి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!