చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యు రా’. ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి ఈ పాటను పాడటం విశేషం. ఇందులోని పాటలను రాజారత్నం బట్లురీ రాయగా, ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ… ‘ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, సరైన తేదీని చూసి సినిమాను విడుదల చేస్తామ’ని తెలిపారు. యువతరాన్ని ఆకట్టుకునేలా సినిమా రూపుదిద్దుకుందని దర్శకుడు ప్రసాద్ ఏలూరి అన్నారు.