NTV Telugu Site icon

Love Guru Trailer: భార్యను ప్రేమించడానికి సలహాలు అడుగుతున్న బిచ్చగాడు

Viajy

Viajy

Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇక దీంతో విజయ్ రూట్ మార్చాడు. ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సడెన్ గా లవ్ గురు గా మారిపోయాడు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం లో లవ్ గురు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీనే నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మిర్నలిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తండ్రి బాధ భరించలేక హీరోయిన్, హీరోను పెళ్లాడుతుంది. పెళ్లి చూపులరోజునే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా కూడా హీరో వినకుండా ఆమెపై ప్రేమతో పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి తరువాత కూడా హీరోయిన్ మారకపోవడంతో భార్యను ప్రేమించడానికి లవ్ గురును సలహాలు అడుగుతుంటాడు హీరో. వారిద్దరి మధ్య అస్సలు కెమిస్ట్రీ లేదని అందరూ చెప్పుకొస్తారు. మరి భార్యను తనవైపు తిప్పుకోవడానికి హీరో ఏం చేశాడు.. ? అసలు ఎందుకు హీరోయిన్ కు పెళ్లి అంటే ఇష్టం ఉండదు.. ? చివరికి లవ్ గురు వలన ఈ జంట కలుస్తారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విజయ్ ఆంటోనీ ఈసారి కూడా సీరియస్ నోట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి కొద్దిగా కామెడీని యాడ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఈ బిచ్చగాడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.