Lokesh Kanagaraj : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా లోకేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వరుస ప్రమోషన్లు చేసేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. ఈ మూవీ కోసం నేను రూ.50 కోట్లు తీసుకున్నానని.. ఇంత ఎక్కువా అంటూ కొందరు అనుకుంటున్నారు. నా గత సినిమా లియో బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు వసూలు చేసింది.
Read Also : Nidhi Agarwal : పవన్ కల్యాణ్ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్
నా సినిమాల కలెక్షన్లు డబుల్ అయ్యాయి. అలాగే నా రెమ్యునరేషన్ కూడా డబుల్ అయింది. ఇందులో పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే తమిళంలో ఇప్పటి వరకు శంకర్ తప్ప ఈ స్థాయి రెమ్యునరేషన్ ఎవరూ తీసుకోలేదనే టాక్ నడుస్తోంది. లోకేష్ యూనివర్స్ లో వస్తున్న కూలీ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి వాళ్లు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. ఇంత మంది స్టార్ యాక్టర్లు ఉండటంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా పేరు కూలీ అయినా.. వసూళ్లలో మాత్రం కోట్లు కుమ్మరిస్తాడని అంటున్నారు రజినీకాంత్ ఫ్యాన్స్. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో లోకేష్ బిజీగా ఉంటున్నారు. ఇక మూవీ టీజర్ ఉండదని.. డైరెక్ట్ ట్రైలర్ ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పారు. రిలీజ్ కు ముందే ఇన్ని అంచనాలు పెంచేస్తున్న కూలీ.. ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.
Read Also : Kiran Abbavaram : బూతులతో సినిమా.. కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్..
