దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్‌లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు మరోసారి రజనీకాంత్ అనే సినిమా చేసి హిట్ కొట్టాలని ఆయన ప్రయత్నం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.
Also Read: Priyamani : “ఒకప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది: ప్రియమణి
అయితే, ఆ వార్తలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, లోకేష్ తన తర్వాతి సినిమాగా కార్తి హీరోగా నటించిన ఖైదీ సినిమాకి సీక్వెల్‌గా ఖైదీ 2 చేయబోతున్నాడు. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాకి యూనివర్స్‌లో భాగంగా ఉండబోతోంది. ఈరోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైనట్లుగా అధికారిక సమాచారం. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా ప్లాన్ చేస్తున్నా, ఖైదీ 2 ఎలా ఉండబోతుందా అని ఆసక్తి రేగుతోంది.
